సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సురేష్ పటేల్ ప్రమాణ స్వీకారం

సెంట్రల్ విజిలెన్స్  కమిషనర్‌గా సురేష్ పటేల్ ప్రమాణ స్వీకారం

సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేష్‌ ఎన్‌ పటేల్‌ నియాకమయ్యారు. సీవీసీ నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఇటీవల ఆమోదించింది. రాష్ట్రపతి భవన్‌లో సురేష్‌ పటేల్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. సురేష్‌ పటేల్‌ గతేడాది జూన్‌ నుంచి ఆయన తాత్కాలిక సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)గా పని చేస్తున్నారు. సురేష్‌ పటేల్‌ ఇంతకు ముందు ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా సేవలందించారు. 2020, ఏప్రిల్‌లో ఆయన విజిలెన్స్‌ కమిషనర్‌గా నియామకమయ్యారు. ఇంతకుముందు సీవీసీగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ కొఠారీ గతేడాది జూన్‌ 24న పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

 

Tags :