మెగాస్టార్ చిరంజీవితో హీరో సూర్య పోటీ

మెగాస్టార్ చిరంజీవితో హీరో సూర్య పోటీ

మెగాస్టార్ చిరంజీవి, హీరో సూర్య పోటీ ప‌డ‌బోతున్నారు. ఏ విష‌యంలో అంటారా? ఇద్ద‌రు హీరోలు ఏ విష‌యంలో పోటీ ప‌డుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాల ప‌రంగానే. వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య త‌న త‌దుపరి చిత్రం ఎదుక్కుమ్ తునింజ‌వ‌న్‌ను ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో సూర్య పోటీ ప‌డ‌బోతున్నారు. ఏ విష‌యంలో అంటారా? ఇద్ద‌రు హీరోలు ఏ విష‌యంలో పోటీ ప‌డుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమాల ప‌రంగానే. వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో సూర్య త‌న త‌దుపరి చిత్రం ‘ఎదుర్కుమ్ తునిందవన్’ ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అదే రోజున మెగాస్టార్ చిరంజీవి త‌న లేటెస్ట్ మూవీ ఆచార్య‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస హిట్స్ మీద సూర్య ఉండ‌టం ఒక‌వైపు.. చిరంజీవి- కొర‌టాల శివవంటి క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఆచార్య మ‌రో వైపు ఉంది.

ఈ రెండు ప్రాజెక్టులు ప్రేక్ష‌కుల్లో ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచివ‌నే. మ‌రి ఈ అంచ‌నాల‌ను ఏ మేర‌కు అందుకుంటాయ‌నేది తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు. దేవ‌దాయ శాఖ‌కు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కావ‌డం... న‌క్స‌లైట్ బ్యాక్‌డ్రాప్ వంటి అంశాల‌తో డైరెక్ట‌ర్ కొర‌టాల శివ త‌న ఆచార్య సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. చిత్రీక‌ర‌ణంతా ఎప్పుడో పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఇందులో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా న‌టించారు. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో తెర‌కెక్కిస్తూ వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో రానున్న సినిమా కావ‌డంతో ఆచార్య‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇక సూర్య విష‌యానికి వ‌స్తే.. డైరెక్ట‌ర్ పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సూర్య న‌టిస్తోన్న చిత్ర‌మిది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత సూర్య థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి వ‌స్తున్నారు. ఇంత‌కు ముందు సూర్య న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా(శూరరై పోట్రు), జై భీమ్ చిత్రాలు రెండు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుద‌లై అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ నుంచి సూర్య‌కు వ్య‌తిరేక‌త వ‌చ్చింది. కానీ.. క‌రోనా ప‌రిస్థితుల స‌మ‌యంలో థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కులు రావ‌డానికి ఇబ్బంది ప‌డుతుండ‌టంతో త‌న రెండు చిత్రాల‌ను నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేశారు. అయితే ‘ఎదుర్కుమ్ తునిందవన్’ సినిమాను నిర్మిస్తున్న‌ది స‌న్ పిక్చ‌ర్స్‌. వీళ్లు త‌మ సినిమాను నేరుగా థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. మ‌రి అదేరోజున చిరంజీవి, సూర్య‌తో పాటు ఇంకెవ‌రైనా పెద్ద హీరోలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌డానికి రాబోతున్నారనే విష‌యం మ‌రికొన్ని రోజుల్లో తెలియ‌నుంది.

 

Tags :