ఆస్కార్ బరిలో రెండు భారతీయ చిత్రాలు

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సమీపిస్తోంది. ప్రస్తుతం చిత్రాల పరిశీలన జరుగుతోంది. ఆస్కార్ అవార్డుల బరి జాబితాలో రెండు భారతీయ చిత్రాలు స్థానం సంపాదించాయి. సూర్య హీరోగా నటించిన జై భీమ్, మోహన్ లాల్ నటించిన మరక్కార్ చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పోటీకి ఎంపిక అయ్యాయి. ఈ రెండు చిత్రాలు దక్షిణాది సినీ పరిశ్రమ నుంచే ఆస్కార్‌కు వెళ్లడం విశేషం. ఈసారి ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరిలో 276 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది.
Tags :