అమెరికాలో మరోసారి కాల్పులు...

అమెరికాలో మరోసారి కాల్పులు...

అమెరికాలో మరోమారు తుపాకీ గర్జించింది. ఓ దుండగుడు మెషీన్‌గన్‌ తో జరిపిన కాల్పుల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెలిస్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంటేరీ పార్క్‌లో చోటు చేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10:22 గంటల సమయంలో చైనా లూనార్‌ కొత్త సంవత్సరం సందర్భంగా వేల మంది వేడుకలు జరుపుకొంటుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. క్షతగాత్రులైన మరో 10 మందిని ఆస్పత్రికి తరలించామని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. దుండగుడు స్థానికంగా ఉన్న బ్యాన్సింగ్‌ క్లబ్‌ను టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

Tags :