కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత్త

కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత్త

విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేశారు. తాజాగా కాంగ్రెస్‌ ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఇటీవల వెల్‌లో ప్లకార్డులతో నిరసన చేపట్టిన నలుగురు కాంగ్రెస్‌ ఎంపీలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. మానిక్కం ఠాగూర్‌, రమ్యా హరిదాస్‌, జ్యోతిమణి, టీఎన్‌ ప్రతాపన్‌లపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ఈ నలుగూరు ఇవాళ మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభలో ప్లకార్డులను ప్రదర్శించరాదు అని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు.

 

Tags :