శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో స్వధర్మవాహిని ఏర్పాటు

శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో స్వధర్మవాహిని ఏర్పాటు

శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో స్వధర్మ వాహిని పేరుతో ఆధ్యాత్మిక సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థకు సంబంధించిన లోగోను తిరుమలలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవిష్కరించారు. సనాతన ధర్మ పరిరక్షణలో నూతన ఒరవడి కోసమే స్వధర్మ వాహిని సంస్థను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి వివరించారు. విశాఖ శ్రీ శారదాపీఠానికి అనుబంధంగా ఈ సంస్థ పనిచేస్తుందన్నారు స్వరూపానందేంద్ర. ధర్మ మార్గం వైపు యువతరాన్ని నడిపించడమే ఈ సంస్థ లక్ష్యమని, ఈ సంస్థ ద్వారా మారుమూల గిరిజన, హరిజన ప్రాంతాల్లో ధర్మప్రచారం సాగిస్తామన్నారు  యువత ద్వారా వినూత్నంగా ధర్మప్రచారాన్ని ముందుకు తీసుకెళతామని కూడా తెలియజేశారు.

 

 

Tags :