వైభవంగా ఐటీ సర్వ్‌ నిర్వహించిన సినర్జీ 2021

వైభవంగా ఐటీ సర్వ్‌ నిర్వహించిన సినర్జీ 2021

అమెరికాలో ప్రతి ముగ్గురు ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకళ్ళు ఇండియన్‌ అని, ప్రతి ముగ్గురు ఇండియన్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌లో ఒకళ్ళు తెలుగు వారని అంటారు. మన తెలుగు ఐటీ ప్రొఫషనల్స్‌ ఒక పక్క పెద్ద కంపెనీలలో సీనియర్‌ పొజిషన్స్‌ లో ఉంటూ ఏంతో బాధ్యతతో తమ విధులను నివహిస్తూ ఆ కంపెనీలను వృద్ధి చేస్తున్నారో, ఇంకో పక్క ఐటీ కంపెనీలను పెట్టి ఎంట్రెప్రినేటర్స్‌గా కూడా రాణిస్తున్నారు.

ఐటీ కంపెనీలలో పని చేసే ఐటీ ఉద్యోగుల కోసం, ఐటీ  ఎంట్ర ప్రెన్యూర్‌ ల కోసం ఏర్పడిన ‘‘ఐటీ సర్వ్‌ అలయన్స్‌‘‘ సంస్థ ఇప్పుడు 17 చాఫ్టర్లు తో ఐటీ రంగానికి ఏంటో సేవ చేస్తోంది. ప్రస్తుతం శ్రీ రఘు చిట్టిమళ్ల  ఈ సంస్థకి ప్రెసిడెంట్‌గా వున్నారు. సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1 తేదీలలో డల్లాస్‌ నగరంలో నిర్వహించిన  ‘సినర్జీ 2021’ కన్వెన్షన్‌ అమెరికా లో జరిగిన అతి పెద్ద ఐటీ కన్వెన్షన్‌ గా జరిగింది.  దాదాపు 1200 పైగా కంపనీలు, 2000కు పైగా ఐటీ ప్రొఫషనల్స్‌ పాల్గొన్న ఈ సమావేశానికి అమెరికా మాజీ అధ్యక్షులు జార్జిబుష్‌ ముఖ్య అతిధిగా రావటం, దాదాపు కోవిద్‌ సంక్షోభం తరువాత జరిగిన సమావేశం అవటం వలన చాల మంది ఈ కన్వెన్షన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 

Tags :