భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ముగ్గురిని వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబే, క్లాస్‌ హాసిల్‌ మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపికైనట్లు ప్రకటించారు. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను వీరికి  ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేస్తున్నట్లు అకాడమీ తెలిపింది. అయితే వీరిలో జార్జియో పారిసీకి సగం పురస్కారాన్ని ఇవ్వగా, మిగత సగం పురస్కారాన్ని సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌లు పంచుకోనున్నారు. భూపర్యావరణ భౌతిక నమూనా, వైవిధ్యాలను లెక్కించడం, గ్లోబల్‌ వార్నింగ్‌ను అంచనా వేడయంలో చేసిన కృషికి గాను అమెరికా, జపనీస్‌ సంతతికి చెందిన సుకురో మనాబో, జర్మనీకి చెందిన క్లాస్‌ హాసిల్‌మన్‌లకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతిని ప్రకటించారు.

పరమాణువుల నుంచి గ్రహాల స్థితిగతులు, వలయాల వరకు భౌతిక వ్యవస్థల్లో హెచ్చుతగ్గులు, వాటి పరస్పర చర్యలను కనుగొన్నందుకుగాను ఇటలీకి చెందిన జార్జి పారిసీకి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌  అకాడమీ ప్రకటించంది. అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో మనాబే సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. జర్మనీలోని మాక్స్‌ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటరాలజీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా క్లాస్‌ హాసిల్‌మన్‌ పని చేస్తున్నారు. కాగా జార్జి పారిసీ రోమ్‌లోని సపియెంజా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌.

 

Tags :