టీ-ఫైబర్‌కు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీ ఫైబర్)ను నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (కేసీసీఐ) పురస్కారం వరించింది. అహ్మదాబాద్‌లో నిర్వహంచిన కేసీసీఐ అయిదో వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల నుంచి టై ఫైబర్ ఎండీ సుజయ్ కారంపురి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణలో ఇంటింటికి, ప్రతి కార్యాలయానికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించేందుకు టీ ఫైబర్ ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్ భారత్‌లో వినూత్న పరివర్తన విభాగంలో టీ ఫైబర్‌ను కేసీసీఐ ఎంపిక చేసింది. టీ ఫైబర్‌కు పురస్కారంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Tags :