టీహబ్ తో ఫాల్కన్ ఎక్స్ ఒప్పందం

టీహబ్ తో ఫాల్కన్ ఎక్స్ ఒప్పందం

సిలికాన్‌ వ్యాలీలో జరిగే గ్లోబల్‌ స్టార్టప్‌ ఎమర్షన్‌ ప్రోగ్రాం కోసం అమెరికాకు చెందిన ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థతో టీహబ్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్‌లోని స్టార్టప్‌ వ్యవస్థాపకులు అమెరికా మార్కెట్‌ల్లోకి ప్రవేశించేందుకు, తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు వీలు కలగనుంది. ఐదు వారాల ప్రాజెక్టులో భాగంగా కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఉంటాయని టీహబ్‌ సీఈవో ఎం.ఎస్‌.ఆర్‌ తెలిపారు. సిలికాన్‌ వ్యాలీకి చెందిన 40 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, నిపుణులు సూచనలు, సలహాలు ఇస్తారని చెప్పారు. టెక్నాలజీ డేటాతో ముగిసే కార్యక్రమంలో 100 మంది పెట్టుబడిదారులు, పరిశ్రమలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని ఫాల్కన్‌  ఎక్స్‌ సీఈవో మురళి చీరాల తెలిపారు.  తొలిమూడు స్థానాల్లో నిలిచిన స్టార్టప్‌లకు ఫాల్కన్‌ ఎక్స్‌ సంస్థ నుంచి లక్ష అమెరికా డాలర్ల వ్యూహాత్మక నిధులు అందుతాయన్నారు.

 

Tags :