తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి ప్రతిష్టాత్మక అవార్డు

తెలంగాణ ఏవియేషన్ అకాడమీకి ప్రతిష్టాత్మక అవార్డు

తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్‌ అకాడమీకి ప్రతిష్టాత్మక ఏరో క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు లభించింది. పైలెట్లకు శిక్షణ, డ్రోన్‌ పైలెట్‌ ట్రైనింగ్‌, ఏవియేషన్‌ ఇంజనీరింగ్‌ శిక్షణలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు వరించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అకాడమీ ఐదుసార్లు ఈ అవార్డును చేజిక్కించుకోవడం విశేషం. దీంతో అకాడమీ సీఈఓ కెప్టెన్‌ ఎస్‌.ఎన్‌.రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనను సోమేశ్‌ కుమార్‌ అభినందించారు. దేశంలోని 21 సివిల్‌ ఏవియేషన్‌ శిక్షణ సంస్థల్లో తెలంగాణ అకాడమీనే ఐదుసార్లు ఈ అవార్డు వరించిందని తెలిపారు.

 

Tags :