టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” విజేతల ప్రకటన

టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” విజేతల ప్రకటన

2022 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికి పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా,  ఇంగ్లండ్, స్పెయిన్, ఐర్లండ్, గల్ఫ్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం. టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , స్వర పత్రిక https://swara.media/magazines/, మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. బహుమతి పొందిన రచనలు, మరియూ ప్రచురణార్హమైన ఇతర రచనలు టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక లోనూ ప్రచురించబడతాయి. 

 “ఉత్తమ కథానిక విభాగం విజేతలు” 

1. ప్రథమ బహుమతి :  సెల్యూట్ - తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 
2. ద్వితీయ బహుమతి : ఋణం - సాయి ప్రభాకర్ (ఫ్లోరిడా, అమెరికా) ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 
3. తృతీయ బహుమతి : ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు - కె.మీరాబాయి (కాలిఫోర్నియా, అమెరికా) ($28, ప్రశంసా పత్రం) 

న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కథానిక: 

1. గొప్పామె ఉరఫ్ గొప్పాయన భార్య - సౌమ్య వి.బి (కెనడా) 

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు: 

1. దీపపు వెలుగు - నరసింహ గరిమెళ్ళ (టెక్సాస్, అమెరికా)
2. అలెక్సా - శర్మ దంతుర్తి (కెంటకీ, అమెరికా)   
3. బొడ్రాయి - శ్రీధర్ రెడ్డి బిల్లా (కాలిఫోర్నియా, అమెరికా) 
4. అక్షరాభ్యాసం - సుగుణ వల్లి (కెనడా)  
5. మా అమ్మానాన్నల పెళ్లిరోజు - రవి మంత్రిప్రగడ (ఐర్లండ్) 

ప్రశంసా పత్రం పొందినవారు: 

1. గంభీరాలకే మరుదు - లక్ష్మీ రాయవరపు (కెనడా)  
2. డిపార్చర్ గేటు - పాణిని జన్నాభట్ల (మసాచుసెట్స్, అమెరికా)   
3. రక్షణ కవచం - శేషా రత్నం పారుపుడి (టెక్సాస్, అమెరికా) 

“ఉత్తమ కవిత విభాగం విజేతలు”: 

1. ప్రథమ బహుమతి :: ఆర్షజాతి (పద్యఖండిక) -  శఠగోపన్ శ్రీవాత్సవ శేషం (లాస్ ఏంజల్స్, కాలిఫొర్నీయా, అమెరికా) : ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 

2. ద్వితీయ బహుమతి :: నీరాజనం - తేజస్వి పారుపూడి (టెక్సాస్, అమెరికా)  ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 

3. తృతీయ బహుమతి :: కంచె - రఫీ మహమ్మద్ (దక్షిణాఫ్రికా) ($28 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 

న్యాయనిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు పొందిన కవిత: 

1. ఆటుపోట్లు - పొలిమేర మల్లేశ్వరరావు (టెక్సాస్, అమెరికా) 

ప్రోత్సాహక బహుమతులు గెలుచుకున్నవారు: 

1. నేను నాన్నని :: గౌతమ్ లింగ (దక్షిణాఫ్రికా) 
2. ఆకాశం :: రాధికా నోరి (ఫ్లోరిడా, అమెరికా) 
3. అన్వేషణ :: శ్రీధర రెడ్డి బిల్లా (క్యూపర్టినో, కాలిఫొర్నీయా, అమెరికా) 
4. అంతర్ముఖం :: డా.సుదర్శన్ రాపోలు (లివర్మోర్, కాలిఫొర్నీయా, అమెరికా) 
5. ఎటో వెళ్ళిపోయింది మనసు :: శేషారత్నం పారుపూడి (టెక్సాస్, అమెరికా)  
6. నా దేశపు అభివృద్ధిని చూడాలనిపిస్తుంది :: మల్లిఖర్జున రావు కొమర్నేని (ఒక్లహోమా, అమెరికా)   

ప్రశంసా పత్రం పొందినవారు: 

1. ఊగిసలాట - లక్ష్మీ రాయవరపు (కెనడా)  
2. కిటికీ -  మోహన్ మణికంఠ ఉరిటి (స్పెయిన్)  
3. పలకరింపు - యామిని రాజశేఖర్ కొల్లూరు (గల్ఫ్ - అబు దాబి) 
4. ఎదురు చూపులు - రవి మంత్రిప్రగడ (ఐర్లండ్)   
5. సిపాయి - రాజేష్ తోలేటి (ఇంగ్లండ్) 
6. నేస్తం - ఇందు నిట్ల (ఒంటారియో, కెనడా) 

విజేతలందరికీ సాహిత్యాభినందనలు. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర మరియూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!! టాగ్స్ ఆధ్వర్యంలో “శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” నిర్వహణకు సహాయ సహకారాలు అందజేసిన రమేష్ వడలి గారికి టాగ్స్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు సహాయ సహకారాలు అందజేసిన శ్రీ రమేష్ వడలి గారికి టాగ్స్ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. టాగ్స్ వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం సంవత్సరం పొడవునా రచనలు స్వీకరించడం జరుగుతుంది. భారత్ తో సహా విదేశాలలో నివసిస్థున్న రచయితలు ఎవరైనా వారి కథ, కథానిక, కవిత, వ్యాసాలు, మరియూ పుస్తక పరిచయం వంటి రచనలు మా ఈమెయిలు telugusac@yahoo.com  కు సంవత్సరం పొడవునా పంపవచ్చును. 

“శ్రీ UAN మూర్తి స్మారక 4వ రచనల పోటీ” ఫలితాల సమాచారం ఈ క్రింది ఫేస్ బుక్ లింకు లో ఉంచబడినది.   

https://tinyurl.com/TagsUanMurthy4thContestResults   

సదరు ఫేస్ బుక్ లంకెను లైక్ చేయగలరు, తద్వారా మా ఈ ప్రయత్నాన్ని మీ స్నేహితులతో పంచుకొనగలరు.  

శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రిక పూర్వ సంచికలకోసం ఈ లంకెను సందర్శించండి: http://sactelugu.org/tags-patrika/  

ధన్యవాదాలు, 

శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం 

ఈమెయిలు: telugusac@yahoo.com 

Telugu Association Of Greater Sacramento (TAGS) 
Post Box: 1666 
Folsom, CA-95763, USA 
Website: http://sactelugu.org 
Facebook: https://facebook.com/sacTelugu 

 

Tags :