తానా మీడియా సమన్వయకర్తగా ఠాగూర్ మల్లినేని

తానా మీడియా సమన్వయకర్తగా ఠాగూర్ మల్లినేని

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మీడియా సమన్వయకర్తగా ఠాగూర్‍ మల్లినేని నియమితులయ్యారు. ఈవెంట్స్ సమన్వయకర్తగా శ్రీనివాస్‍ కూకట్ల, మెంబర్షిప్‍ బెనిఫిట్స్ సమన్వయకర్తగా శ్రీని యలవర్తి,  వెబ్‍ కమిటీ చైర్మన్‍ గా బిల్హన్‍ చౌదరి ఆలపాటిని తానా కార్యనిర్వాహక వర్గం నియమించింది. 2021-23 టర్మ్ కి జాతీయ, ప్రాంతీయ ఎడ్హాక్‍ కమిటీలు అలాగే సిటీ కోఆర్డినేటర్స్ నియామకాల కోసం అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన తానా కార్యనిర్వాహకవర్గం సెప్టెంబర్‍ 8న సమావేశమై నియామకాలను చేపట్టింది. ఈ సమావేశంలో  మీడియా సమన్వయకర్తగా ఠాగూర్‍ మల్లినేని ప్రత్యేక ఈసీ కోఆర్డినేటర్స్ గా నియమితులయ్యారు.  అలాగే ప్రాముఖ్యత ఉన్న టీం స్క్వేర్‍, కల్చరల్‍, తానా కేర్స్, ఉమెన్స్ ఫోరమ్‍, పాఠశాల, బ్యాక్‍ ప్యాక్‍, కళాశాల, అగ్రికల్చర్‍ ఫోరమ్‍, బాలోత్సవం, మెంబర్షిప్‍ బెనిఫిట్స్ తదితర జాతీయ, ప్రాంతీయ ఎడ్హాక్‍ కమిటీలకి ఛైర్మన్‍, కోఛైర్మన్‍ లను మరియు సిటీ కోఆర్డినేటర్స్ ని నియమించారు.

 

Tags :