వెనక్కి తగ్గిన అమెరికా!

వెనక్కి తగ్గిన అమెరికా!

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌లో పర్యటన విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. ఈ వారంలో నాలుగు ఆసియా దేశాల్లో పర్యటించనున్నట్లు పేలోసి ధ్రువీకరించారు. అందులో తైవాన్‌ ఊసే లేదు. తైవాన్‌లో పెలోసి పర్యటించే అవకాశం వుందని వార్తలు వస్తున్నప్పటి నుంచి చైనా తీవ్రంగా స్పందించింది. ఈ పర్యటన జరిగితే తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వాణిజ్యం కోవిడ్‌ మహమ్మారి వాతావరణ మార్పులు భద్రత, ప్రజాస్వామ్య, పాలన వంటి అంశాలపై చర్చించేందుకు సింగపూర్‌, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్‌లలో పర్యటించే కాంగ్రెస్‌ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్నట్లు పెలోసి తెలిపారు.

 

Tags :