చైనాకు తైవాన్ హెచ్చరిక... మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం

చైనాకు తైవాన్ హెచ్చరిక... మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం

చైనాకు తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌ వెణ్‌ గట్టి సందేశం పంపారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో ఒక రోజు పర్యటించి, వెళ్లడం విదితమే. దీనిని వ్యతిరేకిస్తున్న చైనా తైవాన్‌ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. దీనితో తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌ వెన్‌ చైనాకు హెచ్చరిక చేశారు. తాము వివాదాన్ని పెంచబోమని ఆమె స్పష్టం చేస్తూ, అదే సమయంలో తైవాన్‌ తన సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటుందని ప్రకటించారు. చైనా తైవాన్‌ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు చేపట్టింది. కారణం మేరకు స్పందించాలని, నిగ్రమం పాటించాలని బీజింగ్‌ను కోరుతున్నాం. తైవాన్‌ ఘర్షణను పెంచదు. కానీ, మా సార్వభౌమత్వం, భద్రత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం అని ఇంగ్‌ వెన్‌ ప్రకటించారు.

 

Tags :