అది కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ

వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని, అది కాంగ్రెస్ అంతర్గత సంఘర్షణ సభలా జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం మేము చేసిన పోరాటంలో కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదన్నారు. ఉద్యమ ప్రభావంతోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని స్పష్టం చేశారు. వరంగల్ డిక్లరేషన్ రాష్ట్రానికా లేదా దేశానికి అనే విషయాన్ని కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీకి ఏఐసీసీ ఇస్తామంటే పారిపోయారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటిషియన్ అని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు టీఆర్ఎస్ ఒంటరిగానే వెళ్తుందని, ఎవరితోనూ పొత్తు ఉండదని అన్నారు.
Tags :