ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదు : మంత్రి తలసాని

ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదు : మంత్రి తలసాని

దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధాని మోదీకి ఇష్టం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తున్నారని మోదీ, అమిత్‌ షాలు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌ లో చేసిన విధంగానే మహారాష్ట్రలో కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.

మహారాష్ట్రలోని ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్రతోనే ఎమ్మెల్యేలను ఒక చోట నుండి మరో చోటుకు తరలిస్తుందని ఆరోపించారు. అధికారం శాశ్వతం  కాదని, బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవని, మహారాష్ట్ర పరిస్థితి బీజేపీకి కూడా వస్తుందని అన్నారు. మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం హింసను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిధ్‌కు వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగితే బీజేపీ నేతలు ఇష్టమెచ్చిన విధంగా మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు.

 

Tags :