మన ఊరు-మన బడికి జయ్‌ తాళ్ళూరి రూ.25 లక్షల విరాళం 

మన ఊరు-మన బడికి జయ్‌ తాళ్ళూరి రూ.25 లక్షల విరాళం 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి తానా మాజీ అధ్యక్షుడు, తాళ్లూరి ట్రస్టు నిర్వాహకులలో ఒకరైన తాళ్లూరి జయశేఖర్‌ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌ మండలం ఇరవెండి గ్రామంలోని తన నివాసంలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుతో కలిసి జయశేఖర్‌ మీడియాతో మాట్లాడారు. తన తల్లి తాళ్ళూరి భారతిదేవి స్మారకార్థం మన ఊరు-మన బడికి రూ.25 లక్షలను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ విరాళంతో పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఇప్పటికే స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు.

 

 

Tags :