కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారణ్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ?

కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారణ్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు త‌న సినిమాల‌ను పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే తార‌క్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ప్రారంభం కానుందనే సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ స్టూడెంట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారంటూ ప‌లు ర‌కాలైన వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప‌నితో బిజీగా ఉన్న యంగ్ టైగ‌ర్‌.. మ‌రో వైపు పాన్ ఇండియా సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నారు. కొర‌టాల శివ సినిమా KGF1, KGF 2 చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్  ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. ఈ సినిమాల‌తో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఎన్టీఆర్ ట్రాక్ ఎక్కించే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నార‌ట‌.

తాజాగా సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఎన్టీఆర్ ఓ కోలీవుడ్ ద‌ర్శ‌కుడి తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. రీసెంట్‌గా స‌ద‌రు ద‌ర్శ‌కుడు ఎన్టీఆర్‌ను క‌లిసి క‌థ‌ను వినిపించార‌ట‌. ఈ సినిమాల‌తో పాటు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను ఎన్టీఆర్ ట్రాక్ ఎక్కించే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నార‌ట‌. డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చ‌టంతో క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  

ఆడుగ‌లం సినిమాతో నేష‌న‌ల్ అవార్డుని ద‌క్కించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన వెట్రిమార‌న్ త‌ర్వాత రూపొందించిన విశార‌ణై.. వ‌డ చెన్నై, అసుర‌న్ వంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నారు. డైరెక్ట‌ర్‌గానే కాదు ఓ వైపు నిర్మాత‌గా, మ‌రో వైపు రైట‌ర్‌గానూ కొన్ని సినిమాల‌కు ఆయ‌న వ‌ర్క్ చేస్తున్నారు. త‌దుప‌రి సూర్య‌తో వాడివాస‌ల్ సినిమాను తెర‌కెక్కించటానికి రెడీ అయ్యారు. దాని త‌ర్వాత తార‌క్‌తో సినిమా చేయ‌డానికి క‌థ‌ను సిద్ధం చేసే ప‌నిలో వెట్రి మార‌న్ ఉన్న‌ట్లు టాక్‌.ఇప్ప‌టికే రెండు బ‌డా సినిమాల‌కు ఓకే చెప్పేసిన ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ సినిమాను పూర్తి చేసిన త‌ర్వాతే వెట్రిమార‌న్ సినిమాను ట్రాక్ ఎక్కించే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

 

Tags :