సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం... జల్లికట్టుపై

సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం... జల్లికట్టుపై

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ జల్లికట్టుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే జలికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతో పాటు జల్లికట్టు కార్యక్రమ నిర్వహణపై ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతించింది. అలాగే పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్‌ సామర్థ్యానికి అనుమతి ఇచ్చింది. పోటీదారులు, ప్రేక్షకులు రెండుడోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని, పోటీల ప్రారంభానికి 48  గంటల ముందు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది.

 

Tags :