జొన్నవిత్తులకు 21వ శతాబ్దపు శతక సార్వభౌమ బిరుదు

జొన్నవిత్తులకు 21వ శతాబ్దపు శతక సార్వభౌమ బిరుదు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఉత్తర టెక్సస్‌ తెలుగు సంఘం (టాంటెక్స్‌) లు సంయుక్తంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావును 21వ శతాబ్దపు శతక సార్వభౌమ అనే బిరుదుతో సత్కరించాయి. అలాగే శాలువా, జ్ణాపిక అందించాయి. డాలస్‌ మెట్రో ఏరియాలో ఫ్రిస్కో నగరంలో  ఉన్న కార్యసిద్ధి హనుమాన్‌ దేవాలయంలో యజ్ఞేశ్వర శతకము పద్యగాన మహోత్సవం వైభవంగా జరిగింది.

డాలాస్‌-ఫోర్ట్‌ వర్త్‌ తానా ప్రాంతీయ ప్రతినిధి సతీష్‌ కొమ్మన సాహితీ ప్రియులందరికీ సాదర స్వాగతం పలికి, తానా మరియు టాంటెక్స్‌ సంస్థలు కలసి పనిచేస్తూ మున్ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అని, అందరూ తానా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

సభాధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ.. జొన్నవిత్తుల మంచి ప్రజాదరణ పొందిన సినిమా పాటలు ఎన్నో రాశారని, సాధారణంగా సినీగీత రచయితలు సినీ రంగానికే పరిమితం అవుతారని కాని కవి జొన్నవిత్తుల అనేక సామాజిక స్పృహకలిగిన పేరడీలు, దండకాలు, దాదాపు 30 శతకాలను రాశారన్నారు. తెలుగువేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు సకల దేవతా మూర్తులు కొలువైనటువంటి పవిత్ర కార్య సిద్ది హనుమాన్‌ దేవాలయంలో తనకు దైవదర్శనం ఒక దివ్యమైన అనుభూతినిచ్చింది అని, ప్రకాశరావు గారు హిందూ మతం, ధర్మం కోసం చేస్తున్న కృషి, తపన చాలా గొప్పవని అభినందించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, డాక్టర్‌ పుదూర్‌ జగదీశ్వరన్‌, శ్రీకాంత్‌ పోలవరపు, సతీష్‌ కొమ్మన, చినసత్యం వీర్నపు, సతీష్‌ బండారు, భానుమతి ఇవటూరి, సత్యన్‌ కళ్యాణ్‌ దుర్గ్‌, లెనిన్‌ వేముల, అనంత్‌ మల్లవరపు, వెంకట్‌ ములుకుట్ల, లోకేష్‌ నాయుడు కొణిదల, ఊరిమిండి నరసింహా రెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, ప్రకాశరావు వెలగపూడి, లెనిన్‌ వీర, విజయ్‌ కొల్లపనేని, కృష్ణమోహన్‌ రెడ్డి, వెంకట్‌, డా. రతీరెడ్డి, సాగర్‌ అండవోలు, చంద్రహాస్‌ మద్దుకూరి, పాలేటి లక్ష్మి, కళ్యాణి తాడిమేటి తో సహా ఎంతో మంది భాషాభీమానులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారికి, సభ విజయవంతం కావడానికి సహకరించిన వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు డాలస్‌ ప్రాంతీయ ప్రతినిధి సతీష్‌ కొమ్మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 


Click here for Event Gallery

 

Tags :