సిఎస్ఎస్ కు తానా సహాయం...బాలికలకు 4లక్షల ఉపకారవేతనాల పంపిణీ

సిఎస్ఎస్ కు తానా సహాయం...బాలికలకు 4లక్షల ఉపకారవేతనాల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని మునగనూర్‌లో ఉన్న సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ (సిఎస్‌ఎస్‌) అనాధ బాలికల ఆశ్రమానికి చెందిన 20మందికి తానా ఫౌండేషన్‌ చేయూత కార్యక్రమం కింద 4లక్షల ఉపకారవేతనాలు అందజేసినట్లు ఫౌండేషన్‌ కార్యదర్శి శశికాంత్‌ వల్లేపల్లి  తెలిపారు.

అనాధ బాలికలను ఆదుకుని వారి బంగారు భవితకు బాటలు వేస్తున్న సిఎస్‌ఎస్‌ నిర్వాహకులను తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకటరమణ కొనియాడారు. సిఎస్‌ఎస్‌ కోర్సుల వైపు విద్యార్థినులు దృష్టి సారించి జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిఎస్‌ఎస్‌ వ్యవస్థాపకురాలు విజయలక్ష్మీ తానాకు ధన్యవాదాలు తెలిపారు.

తానా-చేయూత పథకం కింద ఇప్పటి వరకు 300మంది విద్యార్థులకు 6లక్షల రూపాయల విలువైన పాఠ్య/లేఖన సామాగ్రిని, 2020లో 10లక్షల రూపాయల విలువైన 30 ఉపకారవేతనాలు, నిత్యావసరాలు, సరుకులను అందజేసినట్లు శశికాంత్‌ తెలిపారు. 2020-21 మధ్య సిఎస్‌ఎస్‌కు 20లక్షల విరాళాలు అందజేసిన దాతలు డా.జంపాల చౌదరి, డా.కాకరాల ప్రసాద్‌, వెంకట్‌ యార్లగడ్డ, వల్లేపల్లి ప్రియాంక, గొర్రెపాటి శ్రీనివాస్‌చంద్‌, పంచమర్తి నాగ, నూతక్కి సుధ, గోగినేని శ్రీనివాస్‌, వేజెండ్ల తదితరులకు తానా ఫౌండేషన్‌ తరఫున శశికాంత్‌ ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :