న్యూజెర్సిలో తానా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం

న్యూజెర్సిలో తానా బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమం

అమెరికన్‌ కమ్యూనిటీకి సేవ చేసే ఉద్దేశ్యంతో తానా నిర్వహిస్తున్న బ్యాక్‌ప్యాక్‌ కార్యక్రమంలో భాగంగా న్యూజెర్సిలో తానా బ్యాక్‌ ప్యాక్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. న్యూజెర్సి రీజియన్‌లోని తానా నాయకులు న్యూబ్రన్స్‌విక్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌లో దాదాపు 100కుపైగా స్కూల్‌బ్యాగ్‌లను, సామాగ్రిని పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. న్యూజెర్సి బోర్డ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ యుటిలిటీస్‌ కమిషనర్‌ ఉపేంద్ర చివుకుల, న్యూబ్రన్స్‌విక్‌ పబ్లిక్‌స్కూల్స్‌ సూపరింటెండెంట్‌ డా. ఔబ్రే జాన్సన్‌ తానా చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలియజేశారు. తానా కమ్యూనిటీ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. ఫౌండేషన్‌ ట్రస్టీ శ్రీనివాస్‌ ఓరుగంటి, రామకృష్ణ వాసిరెడ్డి, తులసీరాం కొడాలి, శ్రీచౌదరితోపాటు యువ వలంటీర్లు అక్షర వాసిరెడ్డి, అనింధ్య కసుకుర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షుడు జయ్‌ తాళ్లూరి, బోర్డ్‌ ట్రెజరర్‌ లక్ష్మీదేవినేని, ఫౌండేషన్‌ ట్రస్టీ విద్యాగారపాటి తదితరుల సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు న్యూజెర్సి తానా రీజినల్‌ రిప్రజెంటెటివ్‌ వంశీ వాసిరెడ్డి తెలిపారు. 

Click here for Photogallery

 

Tags :