న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తానా బంగారు బతుకమ్మ

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో తానా బంగారు బతుకమ్మ

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ లో తానా బంగారు బతుకమ్మ సంబరాలకు సన్నాహాలు చేస్తున్నారు. న్యూయార్క్‌ న్యూజెర్సీ తానా బృందం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం కోసం పెద్దఎత్తున ఏర్పాట్లను చేస్తున్నారు. చరిత్రాత్మకమైన న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో వచ్చే శనివారం సాయంత్రం నాలుగు గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. తానా బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని ఆ సంస్థ సాంస్కృతిక కార్యదర్శి తూనుగుంట్ల శిరీష సమన్వయంతో నిర్వహిస్తున్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా మాజీ అధ్యక్షుడు జయ్‌ తాళ్ళూరి, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ నిరంజన్‌ శృంగవరపు ఆధ్వర్యంలో తానా కార్యవర్గం ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తోంది.

 

 

Tags :