డిసెంబర్‌ 2 నుంచి తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు

డిసెంబర్‌ 2 నుంచి తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు

తానా చైతన్య స్రవంతి 2022లో అధ్భుతమైన సమాజసేవ, సాంస్కృతిక కార్యక్రమాలకు  శ్రీకారం!  ప్రపంచం కోవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకున్న తరువాత, ‘‘అంకిత సేవా భావం, అద్భుత కళా  ధామం’’, అనే నినాదంతో, ‘తానా’ చైతన్య స్రవంతి ఉభయ తెలుగు రాష్ట్రాలలో డిసెంబరు 2 2022 నుండి జనవరి 7 2023 వరకు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. ‘తానా చైతన్య స్రవంతి’ కార్యక్రమాల్లో భాగంగా 20కు పైగా క్యాన్సర్‌ క్యాంపులు 30 కు పైగా ఐ క్యాంపులు 10కి పైగా సాంస్కృతిక కార్యక్రమాలు  స్కాలర్‌ షిప్పుల రూపంలో విద్యార్ధులకు మిలియన్‌ డాలర్ల సహాయం 2500కు పైగా రైతు రక్షణ పరికరాల పంపిణీ, 500కు పైగా వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ పిల్లల ఆటలు ఆడుకోవడానికి క్రీడలకు సంబందిచిన పరికరాల పంపిణీ సైకిల్‌ & వీల్‌ చైర్ల పంపిణీ, ప్రపంచ సాహిత్య సదస్సు... లాంటి కార్యక్రమాలతో ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, ‘తానా ఫౌండేషన్‌’ చైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ ఆధ్వర్యంలో ‘తానా’ చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్‌ సునిల్‌ పంత్ర సమన్వయంతో, మీ ముందుకు వస్తుంది...  మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం! అందరూ ఈ కార్యక్రమాలలో బంధు మిత్రులు, కుటుంబ సమేతంగా పాల్గొని, ‘తానా చైతన్య స్రవంతి 2022’ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందా కోరుతున్నాం.

 

 

Click here for Photogallery

 

 

Tags :