గుడివాడలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలు

గుడివాడలో తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలు

డిసెంబర్‌ 20వ తేదీన తానా ఫౌండేషన్‌ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంత్‌ ఫౌండేషన్‌ సహకారంతో చైతన్య స్రవంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఆధునిక వసతులతో నిర్మించిన వైకుంఠధామంకు ప్రత్యేక వాహనాన్ని విరాళంగా అందజేయనున్నారు. ఉచిత కాన్సర్‌ క్యాంప్‌, ఉచిత కంటి వైద్య శిబిరం, స్కాలర్‌ షిప్‌ల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఖమ్మంలో...

డిసెంబర్‌ 6, 7 తేదీల్లో వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలను తానా బోర్డు సభ్యుడు సామినేని రవి ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నారు. 6వ తేదీన మహబూబాబాద్‌ జిల్లా నేరడ గ్రామంలో సామినేని ట్రస్ట్‌ సహకారంతో మూడు చక్రాల బ్యాటరీ సైకిళ్ళ పంపిణీ చేస్తారు. ల్యాప్‌టాప్‌లు, కుట్టు మిషన్‌లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో మూడు చక్రాల స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు, బాలికలను సైకిళ్లు పంపిణీ, పిండిమరల యంత్రాలు పంపిణీ చేస్తామని సామినేని రవి తెలిపారు. 7వ  తేదీన మాటూరు పేట గ్రామంలో దుప్పట్ల పంపిణీ,  విద్యార్థులకు ఉపకార వేతనాలు, బాలికలకు సైకిళ్ళు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయనున్నారు. 

 

 

Tags :