సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం

సిద్దిపేటలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం

తెలంగాణలోని సిద్దిపేటలో శుక్రవారం నాడు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల రూపాయలు విలువైన పరికరాలను లబ్ధిదారులకు ఉచితంగా అందజేశారు. 15 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు LAPTOP లు బహుకరించారు. ఆరుగురు వికలాంగులకు మూడు చక్రాల బ్యాటరీ సైకిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు , తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి సామినేని, విశ్వనాధ్ నాయనిపాటి  తదితరులు పాల్గొన్నారు. తానా ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా ప్రశంసించారు. తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, చైర్మెన్ యార్లగడ్డ వెంకటరమణ గార్లు విద్యార్ధినిలను అబినంధించారు.

 

Click here for Photogallery

 

Tags :