తెలుగు రాష్ట్రాలలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు..

తెలుగు రాష్ట్రాలలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సేవాభావంతో చేసే ‘తానా చైతన్య స్రవంతి’ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి రోజుకో ప్రాంతంలో ఈ ‘చైతన్య స్రవంతి’ కార్యక్రమం జరుగుతుంది. ఇలా జనవరి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిలో భాగంగానే డిసెంబర్ 2న ‘తానా ఫౌండేషన్ చేయూత’ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో కల్యాణదుర్గంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా 31 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తానా ఫౌండేషన్ తరఫున ఒక్కొక్కరికి రూ.10 వేల రూపాయల స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ, దాత గుదే పురుషోత్తమ చౌదరి ఈ విధంగా విద్యార్థులకు సహకారం అందిస్తున్నారు. అలాగే డిసెంబర్ 7వ తేదీన ఖమ్మం జిల్లాలోని మధిర మండలం మటూర్‌పేటలో ‘ఆదరణ’ కార్యక్రమం జరుగుతంది. దీనిలో భాగంగా అవసరంలో ఉన్న వారికి ల్యాప్‌టాపులు, బైసైకిళ్లు, స్కాలర్‌షిప్‌లు తదితర వస్తువులు అందజేస్తారు. వీటిని నాగేశ్వరరావు సామినేని అందిస్తున్నారు.

 

 

 

Tags :
ii). Please add in the header part of the home page.