షార్లెట్ లో తానా క్రికెట్ పోటీలు విజయవంతం

షార్లెట్ లో తానా క్రికెట్ పోటీలు విజయవంతం

షార్లెట్‌లోని రాబర్ట్‌ స్మిత్‌ పార్క్‌ క్రికెట్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహించిన అపలాచియన్‌ రీజియన్‌ కిక్‌ ఆఫ్‌ టోర్నమెంట్‌తో తానా జాతీయ స్థాయి క్రికెట్‌ ఛాంపియన్షిప్‌ అంగరంగ వైభవంగా ప్రారంభ మైంది. దీనికి కర్త, కర్మ, క్రియ తానా అపలాచియన్‌ రీజియన్‌ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి అనే చెప్పాలి. ఎందుకంటే సుమారు నెలన్నరపాటు ప్లానింగ్‌, స్పాన్సర్షిప్స్‌ సేకరణ, లాజిస్టిక్స్‌ మొదలగు విషయాలలో పకడ్బందీగా ఉండి ఏప్రిల్‌ 23, 24, 30 తారీఖుల్లో అనుకున్నది అనుకున్నట్టుగా టోర్నమెంట్‌ ని విజయవంతంగా పూర్తిచేశారు.

12 జట్లు, 163 మంది ఆటగాళ్లు, 3654 రన్స్‌, 1 సెంచరీ, 158 వికెట్స్‌, 2233 బాల్స్‌, 31 నోబాల్స్‌, 197 వైడ్లు, 364 ఫోర్లు, 208 సిక్సులు, 14 అర్ధ సెంచరీలు, 112 క్యాచ్లు, 8 రనౌట్లు, 19 డకౌట్లు తో కూడిన ఈ అపలాచియన్‌ రీజియన్‌ టోర్నమెంట్‌ అందరినీ ఆకట్టుకుంది.

 అట్లాంటా నుంచి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, అటు మిసిసిప్పి నుంచి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వెంకట రమణ యార్లగడ్డ మరియు క్రీడా కార్యదర్శి శశాంక్‌ యార్లగడ్డ, ఒహాయో నుంచి రవి సామినేని, శ్రీని యలవర్తి, శివ చావా, అలాగే స్థానిక అపలాచియన్‌ రీజియన్‌ నాయకత్వం శ్రీనివాస్‌ చందు గొర్రెపాటి, పురుషోత్తమ చౌదరి గుదె, ఠాగూర్‌ మల్లినేని, రాజేష్‌ యార్లగడ్డ, వేణు చావా, వినోద్‌ కాట్రగుంట తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్‌ సెరిమోనీ కార్యక్రమంలో భాగంగా అన్నిటి కంటే ముందు తానా క్రీడా కార్యదర్శి శశాంక్‌ యార్లగడ్డ అపలాచియన్‌ రీజియన్‌ టోర్నమెంట్‌ జరిగిన మూడు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే అంతకుముందు ప్లానింగ్‌ మరియు లాజిస్టిక్స్‌లో బ్లడ్‌ పెట్టి మరీ పని చేసిన ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి, ఈవెంట్‌ కోఆర్డినేటర్స్‌ వెంకీ అడుసుమిల్లి, అశ్విన్‌ యడ్లపల్లి, శ్రీధర్‌ పెళ్లూరు, లక్ష్మీపతి జూలపల్లి, అలాగే వాలంటీర్స్‌ సుధీర్‌ బొల్లం, శ్రీనాధ్‌ గింజుపల్లి, సాయి కిలారు, ప్రణయ్‌ రెడ్డి మైనంపాటి, రవి బొజ్జ, యశ్వంత్‌ బాగం, సతీష్‌ నాగభైరవ, బాల నల్లపనేని తదితరులందరినీ  అభినందించడం ఆకట్టుకుంది. అనంతరం తానా నాయకత్వం ట్రోఫీ డిస్ట్రిబ్యూషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీనిక్స్‌ సీసీ రన్నర్స్‌ జట్టుకి 750 డాలర్ల క్యాష్‌ ప్రైజ్‌ మరియు ట్రోఫీ, విజేతలైన బిందాజ్‌ బాయ్స్‌ జట్టుకి  1500 డాలర్ల క్యాష్‌ ప్రైజ్‌ మరియు ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా బిందాజ్‌ బాయ్స్‌ జట్టు 500 డాలర్లను తిరిగి తానా ఫౌండేషన్‌కి డొనేట్‌ చేయడం ఆకట్టుకుంది.

 

 

Tags :