క్లీవ్‌ల్యాండ్‌ లో తానా క్రికెట్ పోటీలు

క్లీవ్‌ల్యాండ్‌ లో తానా క్రికెట్ పోటీలు

ఒహాయో రాష్ట్ర క్లీవ్‌ల్యాండ్‌ నగరంలో తానా ఆధ్వర్యంలో మొదటి క్రికెట్‌ పోటీలను గత ఆదివారం నిర్వహించారు. 12 పురుష, రెండు మహిళ, రెండు చిన్నారుల జట్లు పాల్గొన్న ఈ పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా సాగాయి. గెలుపొందిన మహిళల జట్టు బహుమతి నగదును ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుతో పంచుకున్నారు. క్రాంతి, సలీం, సిద్దు, చావా వేణు, సామినేని రవి, కొల్లా అశోక్‌, శరత్‌, నవీన్‌, వడ్లమూడి రవిచంద్ర తదితరులు ఈ పోటీల నిర్వహణకు సహకరించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, క్రీడల సమన్వయకర్త యార్లగడ్డ శశాంక్‌ నిర్వాహకులను అభినందించారు.

 

Tags :