వినుకొండలో ఉపకార వేతనాలు, కుట్టుమిషన్ లు పంపిణీ చేసిన తానా

వినుకొండలో ఉపకార వేతనాలు, కుట్టుమిషన్ లు పంపిణీ చేసిన తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్‌ ఆదరణ కార్యక్రమంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు తానా స్కాలర్‌షిప్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వినుకొండలో ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులు ఐదుగురికి ముఖ్య అతిథి నరసరావుపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు చేతుల మీదుగా లాప్‌ టాప్‌ లను ఓ కార్యక్రమంలో అందజేశారు. 13 మంది విద్యార్థులకు 5,000 చొప్పున స్కాలర్షిప్‌, పేద దర్జీలు ఐదుగురికి కుట్టుమిషన్లు అందజేశారు. పాలడుగు నీలమణి అనే ఇంజనీరింగ్‌ విద్యార్థికి కాలేజీ ఫీజు మొత్తం 40 వేల రూపాయలను వాషింగ్టన్‌ తెలుగు సమితి అధ్యక్షులు అబ్బూరి శ్రీనివాస రావు సహాయం చేయగా జీవి ఆంజనేయులు చేతుల మీదగా నగదును అందజేశారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ నిరు పేదలకు తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. తానా ఫౌండేషన్‌ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి ఆదరణ పొందాలని కోరారు.తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్‌ చైర్మెన్‌ యార్లగడ్డ వెంకటరమణ, ఆదరణ ప్రాజెక్ట్‌ కోఆర్దినెటర్‌ సామినేని రవి మరియు దాత అబ్బూరి శ్రీనివాస రావు గారి సహాయాన్ని అందరూ అభినందించారు.

 

Tags :