గోదావరి వరద బాధితులకు తానా సహాయం...నిత్యావసర వస్తువులు..పుస్తకాల పంపిణీ

గోదావరి వరద బాధితులకు తానా సహాయం...నిత్యావసర వస్తువులు..పుస్తకాల పంపిణీ

భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ఎన్నో గ్రామాలు జలమయం అయ్యాయి. దాంతో ముంపు మండలాల ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. భద్రాచలం పరిసర ప్రాంతాలలో అనేక మంది దాతలు చిరుసాయాన్ని అందిస్తున్నా.. భద్రాచలం నుండి దూరంగా ఉన్నవారికి ఎవరినుండీ సాయం అందట్లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా కాచవరం గ్రామం, కూనవరం మండలం ప్రజల కోరికమేరకు తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వారికి ఆగస్టు 4న నిత్యావసర వస్తువులు, విద్యార్థులకు నోట్‌ బుక్స్‌ పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో  బండి నాగేశ్వరరావు, వాసిరెడ్డి అర్జునరావు పాల్గొన్నారు. 

 

Tags :