ఎయిరిండియా విమానాల రద్దుతో.. ఆహారం దొరక్క ప్రయాణికుల ఇబ్బందులు.. ఆదుకున్న తానా

ఎయిరిండియా విమానాల రద్దుతో.. ఆహారం దొరక్క ప్రయాణికుల ఇబ్బందులు.. ఆదుకున్న తానా

ఉత్తర అమెరికా తెలుగు సంస్థ (తానా) మరోసారి తమ సేవాతత్పరతను చాటుకుంది. చికాగో నగరంలో ఎయిరిండియా విమానాలు రద్దు అవడంతో ఆ విమానాలు ఎక్కాల్సిన ప్యాసింజర్లు విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయారు. సుమారు 200 మంది ప్రయాణికులకు ఆహారం దొరకడం కష్టంగా మారింది. ‘థాంక్స్ గివింగ్ డే’ రోజున ఇది జరగడం వల్ల వారికి రెస్టారెంట్లలో భోజనాలు దొరకలేదు. ఈ సమస్యను రవి సామినేని ద్వారా తెలుసుకున్న తానా నేతలు హేమ కూనూరు, హను చెరుకూరి, రవి కాకర, కుందన్ సాయి హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తమతోపాటు తీసుకొచ్చిన ఆహార పదార్థాలను ప్యాసింజర్లు అందరికీ పంచి పెట్టారు. తానా సేవను వాళ్లంతా మెచ్చుకొని ధన్యవాదాలు తెలిపారు.

 

 

Tags :