ఇండియానాలో తానా కంటి చికిత్సా శిబిరం విజయవంతం

ఇండియానాలో తానా కంటి చికిత్సా శిబిరం విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కమ్యూనిటీకోసం తెలుగు రాష్ట్రాల్లో కంటి చికిత్సా శిబిరాలను నిర్వహిస్తున్నట్లుగానే అమెరికాలో కూడా కంటి చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్‌ 18న ఇండియానా రాష్ట్రం, మెరిల్విల్‌ టౌన్లో తానా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు కమ్యూనిటీ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి సహకారంతో తానా ఉమెన్‌ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి ఆధ్వర్యంలో డాక్టర్‌ శ్రీరామ్‌ శొంటి మరియు నర్సులు సుమారు 4 గంటలపాటు పలువురు ప్రవాసులకు గ్లూకోమా క్యాటరాక్ట్‌ వంటి కంటి సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేశారు. చిన్మయ మిషన్‌ సహాయంతో నిర్వహించిన ఈ తానా కంటి పరీక్షా శిబిరం విజయవంతం అవడానికి సహకరించిన డాక్టర్‌ శ్రీరామ్‌ శొంటి, నగేష్‌ కండ్రేగుల, పద్మిని మాకం, గుర్ప్రీత్‌ సింగ్‌, శాంతి లక్కంసాని, మైథిలి పిట్టల, శశి మందల, కిరణ్‌ వంకాయలపాటి మరియు రాధిక గరిమెళ్ళ తదితరులకు తానా ఉమెన్‌ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు తానా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను కొనియాడారు.

చికాగోలో

చికాగోలో కూడా తానా కంటి పరీక్ష శిబిరం జరిగింది. సౌత్‌ వెస్ట్‌ సబర్బ్స్‌ లోని బోలింగ్బ్రూక్‌ లో తానా ఉమెన్‌ సర్వీసెస్‌ కోఆర్డినేటర్‌ డా. ఉమా ఆరమండ్ల కటికి మరో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని బొలింగ్బ్రూక్‌ సిటీ మేయర్‌ మేరీ అలెగ్జాండర్‌ బస్త సందర్శించడమే కాకుండా తానా సేవలను అభినందించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పలువురికి డాక్టర్‌ శ్రీరామ్‌ శొంటి కంటి పరీక్షలు చేశారు.ఈ మెగా శిబిరానికి హేమ అద్దంకి, శ్రీదేవి దొంతి, మైథిలి పిట్టల, గుర్ప్రీత్‌ సింగ్‌, కిరణ్‌ వంకాయలపాటి, సునీత రాచపల్లి, సంధ్య అద్దంకి, శ్రీలత గరికపాటి, హేమ కానూరు, హను చెరుకూరి, యుగంధర్‌ యడ్లపాటి, కృష్ణ మోహన్‌ చిల్మకూర్‌ తదితరులు తోడ్పాటు అందించారు.

 

Click here for Photogallery

 

 

Tags :
ii). Please add in the header part of the home page.