న్యూయార్క్ ఇండియా డే పెరెడ్‌లో దేశభక్తిని చాటిన తానా

న్యూయార్క్ నగరం నడిబొడ్డున న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఎ) నిర్వహించిన 75 వ స్వాతంత్ర సంబరాల భారీ పరేడ్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కూడా పాల్గొంది. తానా నాయకులు పెద్దఎత్తున పాల్గొనడంతోపాటు తానా శకటాన్ని దేశభక్తిని పెంపొందించేలా రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తానా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. చిన్నారులు ప్రదర్శించిన లంబాడి నృత్యాలు, దేశభక్తి గీతాలు, కూచిపూడి నృత్యాలు, అల్లూరి సీతారామ రాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, రaాన్సీ లక్ష్మీబాయి వేెషాలు ఈ పెరెడ్‌ను చూడటానికి వచ్చిన లక్షలాదిమందిని ఆకర్షించింది.
ప్రతి సంవత్సరం న్యూయార్క్ నగరంలో లక్షలాదిమంది భారతీయులందరు పాల్గొనే ఈ సంబరాలులో ఈ సంవత్సరం గ్రాండ్ మార్షల్‌గా టాలీవుడ్, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘భారత్ కా తిరంగా.. కభీ రaుకేగా నహీ’.. పుష్ప డైలాగ్‌తో అందరినీ అలరించారు. తెలుగు నటుడు అల్లు అర్జున్ రాకతో తెలుగువారంతా ఈ వేడుకల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని మరియు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ వేడుకల్లో అతిధులుగా పాల్గొనడం తెలుగు వారికి గర్వకారణం అని తానా నాయకులు కొనియాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక తెలుగువానిగా అమెరికాలోని ఎన్నారైలంతా కలిసి చేసుకునే ఈ పండుగలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
తానా పరేడ్ ఫ్లోట్ ని తెలుగు స్వతంత్ర సమరయోధులు చిత్రాలతొ, భారత జాతీయ జెండాలు, తానా జెండాలు మరియు మువన్నెల బెలూన్లతో అందంగా అలంకరించారు.
ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ చౌదరి మాట్లాడుతూ తానా ఎప్పుడు మాతృదేశానికి సేవ చేయడానికి ముందు ఉంటుందని చెప్పారు. తానా సేవల సమన్వయకర్త రాజా కసుకుర్తి మరియు బోర్డ్ కోశాధికారి లక్ష్మి దేవినేని మాట్లాడుతూ అమెరికాలో ఉన్నా మేము అందరం తానా ద్వారా కర్మ భూమితో పాటు మాతృభూమికి కూడా సేవచెయటానికి ముందు ఉంటామని చెప్పారు. తానా మాజీ అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి కూడా తెలుగువారికి సేవలందించడంలో తానా ముందుంటుందని అన్నారు.
ఈ ఇండియా డే పెరెడ్‌లో తానా శకటాన్ని ప్రైమరీ వరుసలో తీసుకురావడంలో విద్యాగారపాటి చేసిన కృషిని అందరూ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జాని నిమ్మలపుడి, శ్రీనివాస్ ఒరుగంటి, విద్య గారపాటి, దిలీప్ ముసునూరు, శిరీష, శ్రీ కొనంకి, సుధీర్ నారెపలెపు, శివని, శ్రీలక్ష్మి అద్దంకి, ద్రువ చౌదరి తదితరులు పాల్గొన్నారు.