జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనం అవసరం

జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనం అవసరం

సొంత గ్రామంలో పాఠశాలకు పుస్తకాలందించిన చుండ్రు సతీష్
తానా ఫౌండేషన్‌ సేవలకు వెదురుమూడి గ్రామస్తుల అభినందన

చదువుకునే ప్రతి ఒక్కరు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకుంటే  జ్ఞాన సముపార్జన సాధ్యమని తానా ఫౌండేషన్ లైబ్రరీస్ కో ఆర్డినేటర్ చుండ్రు సతీష్ అన్నారు. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి గ్రామంలో ఉన్న మండల ప్రజాపరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలకు పుస్తకాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చుండ్రు సతీష్ మాట్లాడుతూ టెక్నాలజీ పెరుగుతున్న నేటి దినాలలో పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గిందని, దీనిపై తానా ఫౌండేషన్ ప్రత్యేక దృష్టి సారించి పుస్తకాలను పంపిణీ చేస్తోందన్నారు. తాను పుట్టి పెరిగిన పాఠశాలకు తానా ఫౌండేషన్ ద్వారా పుస్తకాలు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా విరివిరిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ సమయంలో కూడా తానా ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్‌ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, రాజా కసుకర్తి తదితరుల సహకారంతో ఎన్నో కార్యక్రమాలను లైబ్రరీస్ కో ఆర్డినేటర్లుగా ఉన్న తాను, రమణ అన్నె కలిపి ఈ కార్యక్రమం తలపెట్టామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు చుండ్రు సతీష్ పుస్తకాలను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతామని సతీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల అవసరార్ధం కంప్యూటర్లు, ప్రింటర్ కావాలని కోరగా తప్పనిసరిగా అందజేస్తామని సతీష్ హామీ ఇచ్చారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ చదువుకుని అమెరికాలో ఉన్నా సొంత గ్రామానికి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన చుండ్రు మురళీకృష్ణను సతీష్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చుండ్రు అచ్యుతరామారావు,చుండ్రు నరసింహారావు, చుండ్రు మురళీకృష్ణ, డివి రాఘవులు, జి.పద్మావతి, కె.కృష్ణవేణి, కెవి రాంబాబు, వి.వీరబాబు, గున్నం నాగబాబు, సత్తిబాబు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణ కు సహకరించిన తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తికి సతీష్ చుండ్రు ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

Tags :