తెలుగు ప్రజల కోసం ఏపీలో తానా ఆధ్వర్యంలో ‘ఉచిత మెగా కంటి శిబిరం’

తెలుగు ప్రజల కోసం ఏపీలో తానా ఆధ్వర్యంలో ‘ఉచిత మెగా కంటి శిబిరం’

‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటారు పెద్దలు. అందుకే తెలుగు ప్రజల కోసం ఉచితంగా కంటి శిబిరం ఏర్పాటు చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి నిర్ణయించింది. దీనికోసం సక్షమ్ ఫౌండేషన్‌తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కంటి శిబిరం ఏర్పాటు చేయనున్నారు. కల్యాణదుర్గం మండలంలో చాపిరి గ్రామంలో డిసెంబరు 3న ‘ఉచిత మెగా కంటి శిబిరం’ ఏర్పాటు చేస్తున్నట్లు తానా ప్రకటించింది. ఈ శిబిరంలో కంటి పరీక్షలతోపాటు కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయనున్నారు. ఈ శిబిరాన్ని హరిత మందల స్పాన్సర్‌ చేస్తుండగా.. తానా ఫౌండేషన్ ట్రస్టీ అయిన పురుషోత్తమ్ చౌదరి గుడె ఈ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా ఉన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.