తానా ఆధ్వర్యంలో టెలి ఆరోగ్య కేంద్రం-ప్రపంచంలోని తెలుగువారందరికీ వైద్య సేవలు

తానా ఆధ్వర్యంలో టెలి ఆరోగ్య కేంద్రం-ప్రపంచంలోని తెలుగువారందరికీ వైద్య సేవలు

- తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు

తెలుగు ప్రజలకి సేవలో ఎప్పుడూ ముందుండే తానా మరో వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ గ్లోబల్‌ డాక్టర్స్‌ వారి సహాయ సహకారాలతో టెలి ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రంచంలో ఉండే అందరి తెలుగు వాళ్ళకి అందుబాటులో వుండే విధంగా వివిధ ఆరోగ్య సమస్యలకి సంబంధించిన సలహాలు సూచనలకు అమెరికా, యూకే మరియు ఇండియా లో పేరుగాంచిన ప్రముఖ వైద్యులతో ఒక ప్లాటు ఫారంని ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది  నుంచి పదకొండు గంటల వరకు (తూర్పు ప్రామాణిక సమయం) జూమ్‌ కాల్‌లో వైద్యులు అందుబాటులో ఉంటారని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తెలిపారు.

ఫామిలీ మెడిసిన్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌, కార్డియాలజీ ఆర్థోపెడిక్స్‌, పెడియాట్రిక్స్‌, సైకాలజీ, క్రిటికల్‌ కేర్‌, నెర్వ్‌ క్రిటికల్‌, స్లీప్‌  మెడిసిన్‌ కి సంబంధించిన ప్రముఖ వైద్యులు అందుబాటులో ఉంటారని వివరించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకునేవారు eglobaldoctors.com లో తమ వివరాలతో పాటు కావాల్సిన సర్వీస్‌ కూడా నమోదు చేయించుకోవాలనిన తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి తానా తో కలిసి ముందుకు వచ్చిన ఈ గ్లోబల్‌ డాక్టర్స్‌ ప్రతినిధులకు అధ్యక్షులు  అంజయ్య చౌదరి లావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

 

 

Tags :