చార్లెట్‌ లో తానా మదర్స్ డే వేడుకలు

చార్లెట్‌ లో తానా మదర్స్ డే వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అపలాచియన్‌ ప్రాంతంలోని చార్లెట్‌ నగరంలో మే 6 న నిర్వహించిన మదర్స్‌ డే సెలబ్రేషన్స్‌ అమ్మకు నీరాజనం పలికాయి. తానా ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి మరియు విమెన్‌ ఎంపవర్మెంట్‌ ఛైర్‌ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్‌ కి 400 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. వర్జీనియా నుంచి అతిధిగా విచ్చేసిన ప్రముఖ ఫ్యాషన్‌ మోడల్‌ చైతన్య పోలోజు అందరితో కలివిడిగా తిరుగుతూ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. అబ్బుర పరిచిన సోలో మరియు గ్రూప్‌ నృత్యాలు, స్కిట్లు, ఫ్యాషన్‌ షో, ఆట పాటలు ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నాయి.

తెలుగు సినీ గాయని సత్య యామిని తన పాటలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించింది. బాహుబలి, అఖండ, ఆలా వైకుంఠపురంలో, వకీల్‌ సాబ్‌, రాధే శ్యామ్‌, అరవింద సమేత వంటి తాజా చిత్రాలలోని మెలోడీస్‌తో అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మధు నెక్కంటి సమయాను సందార్భంగా పదునైన సంభాషణలతో వ్యవహరిం చారు. తానా అపలాచియన్‌ రీజియన్‌ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి పరలోకంలో ఉన్న తన మాతృమూర్తితో గత అనుభవాలను పంచుకున్నారు. దీంతో కార్యక్రమానికి విచ్చేసిన అమ్మలందరూ వేదిక పైకి వచ్చి మేమున్నామంటూ మనోస్థయిర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా అమ్మల అమ్మలకు ప్రత్యేకంగా అంటూ నాగ పంచుమర్తి కుటుంబం సమర్పించిన రాఫుల్‌ బహుమతులు అందించారు.

గోల్డ్‌ కాయిన్స్‌, డైమండ్‌ రింగ్స్‌, ఖరీదైన చీరలతో గ్రాండ్‌ ర్యాఫుల్‌ బహుమతులతోపాటు, రిటర్న్‌ గిఫ్ట్స్‌ మరియు సర్ప్రైజ్‌ గిఫ్ట్‌ బాక్సులతో మహిళలు ఆనందంగా కనిపించారు. షాపింగ్‌ స్టాల్ల్స్‌ మహిళ లను బాగా ఆకట్టుకున్నాయి. ఈ తానా మదర్స్‌ డే సెలబ్రేషన్స్‌ని మహిళలకు ప్రత్యేకంగా ముఖాముఖీగా అత్యంత ప్రణాళికా బద్ధంగా నిర్వహించిన తానా అపలాచియన్‌ రీజియన్‌ ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి మరియు విమెన్‌ ఎంపవర్మెంట్‌ ఛైర్‌ మాధురి ఏలూరిలను ఆహుతులందరూ అభినందిం చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన శ్రీనాధ్‌ గింజుపల్లి, ఉపేంద్ర సాయిరాం కిలారు, రమ్య పెద్ది, సౌమ్య శ్రీ, దీప్తి నన్నపనేని, స్వప్న కొల్లూరు, పద్మ నున్న, పల్లవి కొల్లిపర, దీప ఉప్పల, మంజూష పూనాటి, మణి కొట్టె, శిరీష అనుముకొండ, విజయ నెల్లి, విజయ ఒగ్గు, నీలిమ దేవినేని, వసంత కావూరి, ప్రదీప్తి, సౌజన్య బండ్లమూడి, ప్రుణితారెడ్డి, వాణి గొర్రెపాటి, ఉషారాణి, రaాన్సీ, జ్యోత్స్న, పద్మజ కొమ్మినేని, రూప తలశిల, వినీషా సాదినేని మరియు ఆహుతులకు కృత్ఞతలు తెలిపి కార్యక్రమాన్ని ముగించారు.

 

Tags :