మాతృమూర్తులకు చీరలు పంపిణీ చేసిన శిరీష తూనుగుంట్ల

మాతృమూర్తులకు చీరలు పంపిణీ చేసిన శిరీష తూనుగుంట్ల

తానా లో ముఖ్య భూమిక పోషిస్తున్న, కొత్తగూడెం పట్టణ వాస్తవ్యులు శ్రీ మిట్టపల్లి పాండు రంగారావు గారి కుమార్తె, శిరీష గారు తన తండ్రి పురిటి గడ్డ లింగ గూడెం లో, తానా మదర్స్ డే కార్యక్రమంలో భాగంగా, 300 మంది మాతృమూర్తులకు చీరెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకట రమణ గారు, టిఆర్ఎస్ నాయకులు చీకటి రామారావు గారు, దారా అప్పారావు గారు,మిట్టపల్లి పాండు రంగారావు గారు మిట్టపల్లి మురళి గారు మిట్టపల్లి రాంబాబు గారు, పాండురంగారావు గారి శ్రీమతి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హాజరైన నాయకులు మాట్లాడుతూ, అమెరికాలో ఉన్నత కొలువులో పనిచేస్తూ, తాను యాక్టివ్ పాత్ర పోషిస్తున్న తానా ఆధ్వర్యంలో, తూనుగుంట్ల శిరీష గారు, మాతృ దినోత్సవం సందర్భంగా, మూడు వందల మంది మాతృమూర్తులకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు, మాతృమూర్తులు కూడా మా అందరి దీవెనలతో, మీరు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కోరారు,

తూనుగుంట్ల శిరీష గారు మాట్లాడుతూ, మీరు చూపు తున్న ఆప్యాయత, ఎప్పటికీ మరువలేమని అన్నారు.

 

Click here for Event Gallery

 

 

Tags :