ఘనంగా అట్లాంటా 'తానా పాఠశాల’ వార్షికోత్సవం

ఘనంగా అట్లాంటా  'తానా పాఠశాల’ వార్షికోత్సవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా ఆధ్వర్యం లో పాఠశాల నిర్వహిస్తున్న ‘తానా పాఠశాల’ అట్లాంటా  నగర విభాగం పాఠశాల వార్షికోత్సవం శనివారం సెప్టెంబర్‌  24వ తేదీ కమ్మింగ్‌ లైబ్రరీ లో ఘనంగా జరిగింది. పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా, కోలాహలంగా సాగింది. తానా సంస్థ రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ వెంకట్‌ మీసాల, పాఠశాల అట్లాంటా నగర ప్రధాన నిర్వాహకులు సునీల్‌ దేవరపల్లి నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తానా పాఠశాల చైర్‌ నాగరాజు నలజుల ‘తానా’ పాఠశాల నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు సందేశాన్ని పంపించారు.

ఈ సందర్భంగా తానాఅధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పిల్లలకు, ఉపాధ్యాయులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసారు. ముఖ్యంగా పాఠశాలలో పిల్లలను చేర్పించి తెలుగుభాషను భావితరాలకు అందించడానికి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు. పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన బాలలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.