అస్టిన్ లో తానా పాఠశాల పుస్తకాల పంపిణీ

అస్టిన్ లో తానా పాఠశాల పుస్తకాల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అస్టిన్‌ ప్రాంతంలో నిర్వహిస్తున్న పాఠశాలలో తెలుగు భాషను నేర్చుకుంటున్న రెండవ విద్యా సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం తానా జాయింట్‌ సెక్రటరీ మురళీ తాళ్లూరి అధ్యక్షతన జరిగింది. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, మాజీ అధ్యక్షులు జయశేఖర్‌ తాళ్లూరి వీడియో కాల్‌ ద్వారా చిన్నారులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల చైర్మన్‌ నాగరాజు నలజుల డల్లాస్‌ నుండి ఆస్టిన్‌ కి విచ్చేసి చిన్నారులను, ఉపాధ్యాయులను, మురళీ తాళ్లూరి, రజని మారం, రాము మారంను అభినందించారు.

ఈ సందర్భంగా తానా జాయింట్‌ సెక్రటరీ మురళీ తాళ్లూరి మాట్లాడుతూ ఆస్టిన్‌ లో తానా పాఠశాలను బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న ఉపాధ్యాయులకు, తానా మరియు పాఠశాల కార్యావర్గానికి ధన్యవాదములు తెలిపారు. రజని మారం ఉపాధ్యాయులను సమన్వయం చేసుకుంటూ, టీమ్‌ ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు ఇరువంటి, రాము శ్యాము భమిడిపాటి, అనుపమ చెరుకూరి, వర్ధిక కంఠన, స్రవంతి శ్రీపాద, కీర్తి సుస్మిత బుద్ధ, సీతా మహాలక్ష్మీ నభానుపూడి, రజని మారం మరియు రాము మారం మొదలైన ముఖ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. శ్రీధర్‌ పోలవరపు, లెనిన్‌ యర్రం, చిరంజీవి మూపనేని, సుమంత్‌ పుసులూరి, దిలీప్‌ చంద్ర, శివ, కిరణ్‌ తాళ్లూరి, కుమార్‌ పిచుకల, ప్రసాద్‌ కాకమాకు, మాధవ్‌ జడల, కృష్ణ ధూళిపాళ, సాంబ వెలమ, బాలాజీ బత్తుల, రామ్‌ మారం మరియు వాలంటీర్లు పాఠశాల అభివృద్ధికి, తెలుగు భాషకు సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఎలాంటి సేవకైనా సిద్ధమని తెలియజేశారు. ఆస్టిన్‌ తానా టీమ్‌కి ధన్యవాదములు తెలియజేశారు.

Click here for Photogallery

 

Tags :