తానా పాఠశాల పుస్తకాల పంపిణీ

తానా పాఠశాల పుస్తకాల పంపిణీ

స్థానిక డల్లాస్ రీజియన్లో తానా పాఠశాల వారి పుస్తకాల పంపిణీ కార్యక్రమం స్థానిక రీజినల్ కోఆర్డినేటర్ సతీష్ కొమ్మన ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం అక్టోబర్ మూడవ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు తానా కార్యవర్గం సభ్యులు విచ్చేశారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్న అందిస్తానని సభాముఖంగా తెలియజేశారు. చిన్నారులందరూ చక్కగా తెలుగు నేర్చుకొని మీ బంధువులతో మాట్లాడి, వారి ఆధరాభిమానాలు పొందాలని సూచించారు. తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ తెలుగు భాష అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే పాఠశాల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందికి తెలుగు బోధించడానికి విశేషమైన కృషి చేస్తున్నామని తెలియజేశారు.

తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు ప్రస్తుతం తానా పాఠశాల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో సహకరిస్తున్నారు. నేను కూడా దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేశారు.

పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల మాట్లాడుతూ పాఠశాల రిజిస్ట్రేషన్స్ కి తానా, పాఠశాల కార్యవర్గాలు మరియు టీచర్లు ఎంతగానో కృషి చేస్తున్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు. అందరి సహకారంతో పాఠశాలను అత్యున్నత స్థితికి తీసుకువెళ్లడమే తన లక్ష్యం అని అన్నారు.

అంకిత భావంతో పాఠశాల కోసం పని చేస్తున్న అందరిని హరీష్ కోయ ప్రశంశించారు. ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ పాఠశాల చేపట్టే కార్యక్రమాలకు తన సహాయం ఉంటుందని తెలిపారు.

డల్లాస్ లో పాఠశాల మరియు కళాశాల కార్యక్రమాలు విజయవంతం అయినందుకు తానా బోర్డ్ ఆఫ్ డైరక్టర్లు మురళీ వెన్నం, జనార్ధన్ నిమ్మలపూడి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యా గారపాటి, కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ హితేష్ వడ్లమూడి మరియు కళాశాల చైర్మన్ రాజేష్ ఆడుసుమల్లి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

లక్ష్మీ పాలేటి, పరమేష్ దేవినేని, లెనిన్ తుళ్లూరి, సాంబ దొడ్డా, రజని మారం, రామ్ మొదలైన వారందరూ పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములమైనందుకు తమకెంతో సంతోషంగా ఉందని, పాఠశాల కోసం మెరుగైన సేవలు అందించడానికి మేమెప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి సహకరించిన వారికి సతీష్ కొమ్మన మరియు లోకేష్ నాయుడు ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తానా మరియు పాఠశాల కార్యావర్గాలు, టీచర్లు, తల్లిదండ్రులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :