అన్నమయ్య సంకీర్తనలకు "బ్రాండ్ అంబాసిడర్" శోభారాజు - లావు అంజయ్య చౌదరి

అన్నమయ్య సంకీర్తనలకు "బ్రాండ్ అంబాసిడర్" శోభారాజు - లావు అంజయ్య చౌదరి

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అధ్యక్షులు మే 21న అన్నమయ్యపురం సందర్శించారు. అన్నమయ్యపుర దేవాలయంలో ఒకే గర్భంలో కోలువై వున్న అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వాములను దర్శించి ఆశీస్సులందుకున్నారు. అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థులు సమర్పించిన సంకీర్తనలు విని, వారిని ఎంతగానో ప్రశంసించి, ఆశీర్వదించారు. అన్నమాచార్య సంకీర్తనలకు "బ్రాండ్ అంబాసిడర్" శోభా రాజు గారు చేసిన విశేష సేవలను అంజయ్య చౌదరి గారు చాలా ప్రశంసించి, వారి ప్రయత్నాలకు తానా సహకారముంటుందని చెప్పారు.

శ్రీ లావు అంజయ్య చౌదరి గారు తానా అధ్యక్షులుగానే కాకుండా అనేక సంఘాలలో సభ్యులై, "మానవ సేవే మాధవ సేవ అన్న దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు" అని శోభా రాజు అన్నారు. అన్నమాచార్య భావనా వాహిని పక్షాన శ్రీ లావు అంజయ్య చౌదరి గారిని సత్కరించారు.


Click here for Photogallery

Tags :