తిరుపతిలో తానా పుస్తక మహోద్యమం

తిరుపతిలో తానా పుస్తక మహోద్యమం

డిసెంబరు 4వ తేదీన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా, తిరుపతి సిటీ చాంబర్‌ సంయుక్త నిర్వహణలో తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తానా పుస్తక మహోద్యమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయిన తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ ‘‘తెలుగు పుస్తకాలను కొని, బహుమతులుగా అందించి, పుస్తకాలను చదివే సంస్కృతిని ప్రోత్సహించడానికి సాహిత్య చరిత్రలోనే అపూర్వంగా తానా పుస్తక మహోద్యమం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.’’ అన్నారు.

‘‘తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించుకోవడం కోసం, మానవ వికాసం కోసం ఉపయుక్తమయ్యే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడానికి ఈ విధంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్న తానా సంస్థ వారికి ధన్యవాదాలు. అందరూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి’’ అని యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కె. రాజారెడ్డి అన్నారు. సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర, వేదిక సమన్వయకర్త శ్రీనివాస్‌ చిగురుమళ్ళ సారధ్యంలో ఈ మహోద్యమం జరుగుతుంది.

తదనంతరం సాహిత్య వేదిక సమన్వయకర్త, శత శతక కర్త శ్రీనివాస్‌ చిగురుమళ్ళ మాట్లాడుతూ ‘‘తెలుగు భాష, సాహిత్యాలను పరిపుష్టం చేసుకోవడం కోసం, పుస్తకాలు కొని చదివే సంస్కృతిని ప్రోత్సహించటం ఒక మంచి మార్గం. పుస్తకాలు కొని చదివే వారు ఉంటేనే కవులు, రచయితలు మరింత ఉత్సాహంగా రచనలు చేయగలరని అందుకే ఈ ఉద్యమాన్ని తల పెట్టాము’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్‌ ఈదర యు.ఎస్‌.ఎ, తుడా- తిరుపతి ఉపాధ్యక్షులు హరికృష్ణ సూర్యదేవర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శ్రీహరి, పత్రికా సంపాదకులు ఏ. గిరిధర్‌, ఆయుబ్‌ ఖాన్‌, వై. షణ్ముగం, హరి, గిరి, శివ, విద్యావేత్త వాసు తెలుగు పుస్తకాలను వివిధ కళాశాలల విద్యార్థులకు అతిథులు బహుమతులు గా అందజేశారు.

Click here for Photogallery

 

Tags :