ఉల్లాసంగా... ఉత్సాహంగా ‘తానా సమ్మర్ క్యాంప్ 2021’ సంబరాలు

ఉల్లాసంగా... ఉత్సాహంగా ‘తానా సమ్మర్ క్యాంప్ 2021’ సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో చిన్నారుల కోసం ‘సమ్మర్‍ క్యాంప్‍’లో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ క్యాంపులో దాదాపుగా 3,500 మంది చిన్నారులు పాల్గొని, నిర్వాహకులకు ఉత్సాహాన్ని నింపారు. ఈ క్యాంపులో పాల్గొనడానికి చిన్నారులకు తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సాహాన్ని అందించారు. ఈ క్యాంపులో భాగంగా క్రియేటివ్‍ ఆర్ట్ క్యాంప్‍, చెస్‍ క్యాంప్‍, పైథాన్‍ పోగ్రామ్‍, లిటిల్‍ చెఫ్‍ బ్యాకింగ్‍ క్యాంప్‍, వన్స్ అపాన్‍ ఎ టైమ్‍, ఆండ్రాయిడ్‍ అప్లికేషన్‍ డెవలప్‍మెంట్‍, టాలివుడ్‍ డ్యాన్స్ మస్తీ, మ్యాథ్‍ ఎన్రిచ్మెంట్‍ తో పాటు వివిధ అంశాలను  ఇందులో చేర్చారు. ఇక.. ఈ కార్యక్రమం ద్వారా 35000 డాలర్లకు పైగా విరాళాలను సేకరించారు. ఈ సందర్భంగా సమ్మర్‍ క్యాంప్‍ రూపకర్త, కమ్యూనిటీ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ రాజా కసుకుర్తి ముందు మాటలతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

అతిథులందర్నీ పరిచయం చేస్తూ, ఈ కార్యక్రమం సజావుగా సాగేలా చూసి, మార్గనిర్దేశనం చేశారు. ఈ సమ్మర్‍ క్యాంపులు ప్రస్తుతం యువ తరానికి, తానా కార్యవర్గానికి వారధిగా నిలుస్తోందని అన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రారంభోపన్యాసం చేశారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి క్యాంపులను తానా నిర్వహిస్తోందని, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రకటించారు.రాబోయే అతికొద్ది రోజుల్లో ‘తానా బాలోత్సవ్‍’కూడా నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే ప్రకటిస్తామని అంజయ్య చౌదరి లావు పేర్కొన్నారు. ఇది కేవలం క్యాంపు మాత్రమే కాదని, దీని వెనుక చాలా కృషి ఉందని, ఓ పెద్ద కార్యక్రమమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని, ఇక ముందూ జరగబోయే తానా కార్యక్రమాలకు కూడా ప్రోత్సాహం అందిస్తూ, విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి తల్లిదండ్రులు బాగా సహకరిస్తున్నారని ప్రశంసించారు. ఈ క్యాంపుకు సహకరించిన తల్లిదండ్రులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పిల్లలను మరింత ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలందరూ భవిష్యత్‍ నిర్మాతలని, కేవలం తానాకు మాత్రమే వీరంతా పరిమితం కాదని, దేశానికి విధాతలని పేర్కొన్నారు.  వీరితో పాటు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వెనకుండి సహకరిస్తున్న తానా సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు ప్రకటించారు. తానా ఆధ్వర్యంలో అద్భుతంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందని, తానా కార్యవర్గం అంతా కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని అంజయ్య చౌదరి లావు ఆకాంక్షించారు.

తానా కోశాధికారి అశోక్‍బాబు కొల్లా మాట్లాడుతూ... తానా సమ్మర్‍ క్యాంపుకు సహకరిస్తున్న తల్లిదండ్రులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. చిన్నారులను ప్రోత్సహిస్తూ, వారిలో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి తల్లిదండ్రులు ఇతోధికంగా సహాయపడుతున్నారని ప్రశంసించారు. మరో వైపు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మర్‍ క్యాంపును విజయవంతం చేశారు.

ఈ సమ్మర్‍ క్యాంపు విజయవంతంగా సాగడానికి శశాంక్‍ యార్లగడ్డ, రవి వడ్లమూడి, దిలీప్‍ ముసునూరి, సుమంత్‍ రామిసెట్టి, ప్రదీప్‍ గడ్డమ్‍, వంశి వాసిరెడ్డి, వెంకట మీసాల, సునీల్‍ కోగంటి, రత్న ప్రసాద్‍ గుమ్మడి, సౌమ్య సూరపనేని, రాజేశ్‍ యార్లగడ్డ, నాయుడమ్మ యలవర్తి, సుధీర్‍ నారెపలేపు, రేఖ ఉప్పులూరి, , రమణ అన్నె, అబ్దుల్‍ కలామ్‍ ఆకుల, ఠాగోర్‍ మల్లినేని, ఫణి కంతేటి, శైలజ చల్లపల్లి, శ్రీ కోనంకి, గోపి వాగ్వల, వెంకట్‍ సింగు, చంద్ర సిరిగిరి, రంజిత్‍ మామిడి, తమ సహాయ సహకారాలను అందించారు. చివరగా తానా కార్యదర్శి సతీశ్‍ వేమూరి ధన్యవాద సమర్పణ చేశారు.

 

Tags :