డల్లాస్ లో తానా వాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్

డల్లాస్ లో తానా వాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్

స్థానిక డల్లాస్ తానా రీజనల్ కో - ఆర్డినేటర్ సతీష్ కొమ్మన గారి ఆధ్వర్యంలో కోవిడ్ - 19 వాక్సినేషన్ డ్రైవ్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగింది.

ఈ కార్యక్రమంలో 5 సంవత్సరాల నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 400 మంది చిన్నారులకు వాక్సిన్ వేయడం జరిగింది. వీరితో పాటు మరో 50మంది పెద్దలకు కూడా బూస్టర్ డోసు వేశారు.

ఈ వాక్సినేషన్ డ్రైవ్ ఇంత విజయవంతం కావడానికి ఫేట్ & ఇండిపెండెన్స్ ఫార్మసీ వారి సహకారం ఎంతో ఉంది. వారికి తానా వారు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు నలజుల, శ్రీకాంత్ పోలవరపు, చిన సత్యం వీర్నపు, పరమేష్ దేవినేని, లోకేష్ నాయుడు, వీర లెనిన్, శ్రీదేవి ఘట్టమనేని, సాంబయ్య దొడ్డా, మురళీ వెన్నం, కుమార్ నందిగం, రాజేష్ అడుసుమల్లి, సతీష్ కోటపాటి, గణేష్ నలజుల మరియు ఎంతోమంది పాల్గొని తమ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తానా వారు స్నాక్స్ మరియు పండ్లు అందజేశారు. 

ఈ కార్యక్రమం ఇంత ప్రశాంతగా, ఆహ్లాదకరంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తానా DFW రీజనల్ కో - ఆర్డినేటర్ సతీష్ కొమ్మన గారు ధన్యవాదములు తెలియజేశారు.

Click here for Photogallery

Tags :