‘తానా’ ఆధ్వర్యంలో అందరూ మహిళలతో ‘విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం’

‘తానా’ ఆధ్వర్యంలో అందరూ మహిళలతో ‘విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం’

తెలుగు సాహిత్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) శ్రీకారం చుట్టింది. పూర్తిగా మహిళలతో ఒక విశిష్టమైన అష్టావధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒక మహిళావధానితపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలే పృచ్ఛకులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుడటం విశేషం. ఈ నెల 27న అంటే ఆదివారం నాడు ఈ కార్యక్రమం జరగనుంది. తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి నెలా చివరి ఆదివారం నాడు జరుగుతుంది. ఇది 42వ అంతర్జాతీయ ఆన్‌లైన్ సమావేశం. ఈసారి అష్టావధానం కార్యక్రమంలో ‘అవధాన విద్వన్మణి’ డాక్టర్ బులుసు అపర్ణ పాల్గొంటారు. అవధాన సంధానకర్తగా అమెరికాలో నివశించే శారదాపూర్ణ శొంఠి వ్యవహరిస్తారు. పృచ్ఛకులుగా కెనడాలో నివశించే సరజ కొమరవోలు, సింగపూర్‌కు చెందిన రాధిక మంగిపూడి, ఇంగ్లండ్‌లో నివశించే అరవిందా రావు, బోత్సువానాలో ఉండే శ్రీదేవీ శ్రీకాంత్, గయానాకు చెందిన ఉమ దేశభొట్ల, న్యూజిల్యాండ్‌లో ఉండే డాక్టర్ నాగలక్ష్మి తంగిరాల, సియాటెల్‌లో నివశించే డాక్టర్ నిడమర్తి నిర్మలాదేవి, సౌదీ అరేబియాలో ఉండే దీపిక రావి వ్యవహరించనున్నారు. ఈ ‘విశిష్ట విశ్వ మహిళా అష్టావధానం’ కార్యక్రమం యప్ (YuppTV)లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఛానెల్ ద్వారా జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు, అమెరికాలో ఉదయం 7 గంటలకు, ఉత్తర అమెరికాలో ఉదయం 9 గంటలకు, యూరప్‌లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

  1. TANA TV Channel – in YuppTV
  2. Facebook: https://www.facebook.com/TANAsocial
  3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
  4. https://youtube.com/teluguone
  5. www.youtube.com/tvasiatelugu
  6. www.youtube.com/manatv
  7. https://www.etvbharat.com/telugu/andhra-pradesh
  8. https://www.etvbharat.com/telugu/telangana

 

 

Tags :
ii). Please add in the header part of the home page.