ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం మరియు సౌత్ ఫోర్క్ డెంటల్ ఆధ్వర్యంలో హెల్త్ కాంప్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం మరియు సౌత్ ఫోర్క్ డెంటల్ ఆధ్వర్యంలో హెల్త్ కాంప్

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం మరియు సౌత్ ఫోర్క్ డెంటల్ కలిసి శనివారం మార్చి 26 న డాలస్ లో నివసించే వారికి ఉచితంగా హెల్త్ కాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ కాంపుని చక్కగా నిర్వహించినందుకు సౌత్ ఫోర్క్ డెంటల్ కి చెందిన డా బిందు కొల్లి గారికి, వారికి సహకరించిన డా కృష్ణ ఎల ప్రోలు, డా వందన మద్దాలి, డా శిల్ప దండ, డా దీపిక కోయ, డా ప్రసాద్ మద్దుకూరి, డా అనురాధ కొల్లూరు, రేఖ కోయ గారికి, వాలంటీర్లు గా పనిచేసిన స్కూలు విద్యార్థిని, విద్యార్థులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఉమా మహేష్ పార్నపల్లి గారు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, వెంకట్ ములుకుట్ల, చంద్ర పొట్టిపాటి, ఉదయ్ నిడిగంటి, అనంత్ మల్లవరపు, శ్రీనివాసులు బసాబత్తిన పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :