ది ఫ్యామిలీ ప్లేస్ ట్రస్టుకు 1205 డాలర్లు విరాళము ఇచ్చిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్

ది ఫ్యామిలీ ప్లేస్ ట్రస్టుకు 1205 డాలర్లు విరాళము ఇచ్చిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్

తెలుగు సంస్కృతికీ తెలుగు భాషకీ పెద్ద పీట వేస్తూ డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరంలో అందరి ఆదరణతో కొనసాగుతున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ ఆపదలో ఉండీ సహాయం కోసం నిరీక్షించే వారిని ఆదుకోవడములోనూ ఎప్పుడూ ముందుంటుంది. గృహహింస వంటి తీవ్రమైన చర్యలకు బాధితులయిన స్థానిక తెలుగువారికి వసతి కల్పించి వారి జీవనానికి భరోసా కల్పించి బాధితులకు అండగా నిలిచే డల్లాస్ లోని ది ఫ్యామిలీ ప్లేస్ ట్రస్టును ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రతినిధులు ఈ శనివారం అనగా 2021 డిసెంబర్ నెల 18 వ తేదీన సందర్శిండం జరిగింది. ఈ సందర్భముగా ట్రస్టుకు ఆర్ధికముగా చేయూత నివ్వదలచి టాంటెక్స్ సంస్థ తరపున 1205.00 డాలర్లు విరాళముగా ఇవ్వడం జరిగింది. మరియు వారికి ఎల్లవేలలా మా సంస్థ సహృదయంతో ఇలాంటి విరాళాలు సహాయ సహకరాలు అందిస్తుంది అని టాంటెక్స్ అధ్యక్షులు అన్నపూర్ణ పాలేటి తేలిపారు.  

ఈ బృహత్ కార్యనికి హాజరయిన వారికి మరియు తమ వంతుగా విరాళాలు ఇచ్చిన దాతలకు టాంటెక్స్ అధ్యక్షులు అన్నపూర్ణ పాలేటి, సంస్థ పూర్వాధ్యక్షులు శ్రీ కృష్ణా రెడ్డి కోడూరు, జాయింట్ ట్రెజరర్ స్రవంతి ఎర్రమనేని, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కో చెయిర్ వేంకట్ ములుకుట్ల, బోర్డు అఫ్ ట్రస్టీస్ మెంబర్ శ్రీకాంత్ పోలవరపు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

Click here for Phtogallery

 

Tags :